NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెన్నా నది పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

1 min read

-తహశీల్దార్ సరస్వతి

చెన్నూరు,  న్యూస్ నేడు: మొంథా సూపర్ సైక్లోన్ తుపాను తీవ్ర తుపాను గా మారిన కారణంగా  రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో పెన్నా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా వాగులు ,వంకలు, చెరువులు ఉన్న గ్రామాల ప్రజలు ఎవరు కూడా అక్కడకు వెళ్లరాదని తహసీల్దార్ సరస్వతి, సీఐ కృష్ణారెడ్డిలు తెలిపారు. పెన్నా పరివాహ ప్రతాలలోని లోతట్టు ప్రాంతాలైన శివాలపల్లె, గుర్రంపాడు, కొండపేటలను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పశ్చిమ బంగాళాఖాతంలో మొంథా తుఫాను తీవ్ర రూపం దాల్చడం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ నుండి అతి భారీగా వర్షాలు కురుస్తున్నాయని దీంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడం జరుగుతున్నదని వాగులు, వంకలు, చెరువులు ఉన్న గ్రామాల ప్రజలు అలాగే పెన్నా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని ఆమె చెన్నూరు మండల ప్రజలకు సూచించడం జరిగింది. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలనివారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఆర్ ఐ, పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

About Author