శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణతో దర్శనమిస్తున్న వాసవి మాత
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో వాసవి శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవవారి శాలలో దసరా నవరాత్రుల పురస్కరించుకుని మూడవ రోజు బుధవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో శ్రీ వాసవి మాత దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు భక్తిశ్రద్ధలతో ఉదయం నుంచి పారాయణం, కుమార్చనలు ,దీప దూప పుష్పాలతో పూజ నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాజా మురళీకృష్ణ,ఉపాధ్యక్షులు బైసాని సురేష్,కార్యదర్శి ఊటుకూరి రమేష్ కుమార్,కోశాధికారి జొన్నలగడ్డ హరిక్రిష్ణ,సహాయ కార్యదర్శులు బైసాని గిరిబాబు,యిసికేల మురళీక్రిష్ణ,సహాయ కోశాధికారులు నాయకంటి గురుప్రసాద్,జక్క శేషఫణి ,కార్యవర్గ సభ్యులువంకదారి నాగరాజు, ఆముదాల నవీన్,నిచ్చెనమెట్ల గురుదత్తు,పొలమడ సుధీర్ కుమార్,కూనా వెంకట శేషగిరిరావు,ఆర్వేటి సతీష్ కుమార్,లింగం రామాంజనేయులు,రాజా రవికాంత్,కుప్పా నాగేంద్ర,నూకల నాగరాజు మరియు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


