NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ లో లైబ్రరీ ప్రారంభించిన జిల్లా జడ్జి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు అధ్యక్షులు,  శ్రీ జి. కబర్థి, కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు  కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి లు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ నందు నూతన లైబ్రరీ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అఫ్ కర్నూలు మెల్విన్  జోన్స్  తరఫున డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  ఆఫీసుకు లా బుక్స్ ను డొనేట్ చేశారు. వీటిని బుధవారం నాడు జిల్లా జడ్జి  మరియు సెక్రటరీ చేతుల మీదుగా ఆవిష్కరించడం అయినది. ఈ పుస్తకాలను డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మరియు సులోచన కి జిల్లా జడ్జి  చేతుల మీదుగా అందించడం జరిగింది.

About Author