ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినం
1 min read

వెలుగోడు, న్యూస్ నేడు: వెలుగోడు పట్టణం లో వాసవి క్లబ్ సభ్యులు మరియు వనిత స్ఫూర్తి క్లబ్ సభ్యులు కలిసి సంయుక్తంగా వాసవి మాతకు మంగళవారం అభిషేకం, కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మర్పణ దినం సందర్బంగా అమ్మవారికి రెండు సంఘాల తరుపున చీరలు సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెనుగొండ కు వాసవి పెనుగొండ అని ప్రభుత్వం పేరు పెట్టడం , ఆత్మర్పణ దినాన్ని ప్రభుత్వ పండుగగా నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకమని, అందులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 209ఎ రాయలసీమ జిల్లా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బాదం నాగేంద్ర , జోన్ చైర్ పర్సన్ తాళ్లూరి సంజీవ రాయ ప్రసాద్ , వెలుగోడు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ బలుసా రాము సెక్రటరీ నాగరాజు ట్రెజరర్ చంద్రశేఖర్ వెలుగోడు వనిత స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి , సెక్రటరీ అనురాధ, ట్రెజరర్ సునీత, వెలుగోడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు , భక్త బృందం పాల్గొనడం జరిగింది.

