NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండ నియోజకవర్గం లోని 38 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మంగళ వారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చసిన  ఈ కార్యక్రమంలో 38 మంది  లబ్ధిదారులకు 25 లక్షల 50 వేల రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదవాళ్లు అనారోగ్యం తో వైద్యం చేసుకున్న వారు ఎన్​టీఆర్​  వైద్య సేవ వర్తిచని వారికి  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అందించి పేదలకు అండగా నిలిచారని అన్నారు. పేదల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అని తెలిపారు. చెక్కుల అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే. ఈ. శ్యాం కుమార్ కు అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

About Author