NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన వీరభద్రగౌడ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   రాష్ట్ర టిడిపి యువనేత,  ఐటి, విద్యాశాఖ మంత్రివర్యులు .నారా లోకేష్ బాబు  అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్  ఆదేశాల మేరకు.ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,బి.వీరభద్ర గౌడ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు పి.తిక్కారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణం తనుష్ కన్వెన్షన్ హాలులో జరిగిన కర్నూలు పార్లమెంట్ టిడిపి విస్తృత స్థాయి సమావేశమునకు హాజరు కావడం జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రీమ్యాన్ కమిటీ నాయకులు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి .రాం ప్రసాద్ రెడ్డి ,హిందూపురం ఎంపీ పార్థసారథి మాజీ మంత్రినక్కా ఆనంద్ బాబు  హాజరయ్యారు.ముక్యంగా ఇందులో కర్నూలు జిల్లా టిడిపి నామినేటెడ్ పదవుల సంస్థాగత ఎన్నికల నియమావళి గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.   ముక్యంగా ఈకార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, డిప్యుటీ సీఎం  కే.ఈ. కృష్ణమూర్తి  ఎమ్మెల్సీ బీటి  నాయుడు , రాష్ట్ర పారిశ్రామిక మంత్రి వర్యులు టిజి భరత్ ,కర్నూలు . ఎంపీ బస్తిపాటి నాగరాజు  అలాగే జిల్లా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఇంచార్జి లు, ఎంఎల్సీ లు,కేడిసిసి ఛైర్మన్లు,రాష్ట్ర వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,మాజీ మంత్రులు,మాజీ జెడ్పి చైర్మన్లు, జిల్లా ఎస్సీ సెల్, బిసి సెల్,మైనార్టీ సెల్ నాయకులు జిల్లా ఇతర ముఖ్యనాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author