వినాయకచవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
1 min read

ఎస్సై మధుసూదన్
ప్యాపిలి, న్యూస్ నేడు: మట్టి వినాయకులను పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం అని సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ అన్నారు.రంగుల వినాయక విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని అందువల్ల వినాయకచవితి పండుగను మట్టి వినాయకుల ప్రతిమలతో పూజలు చేసుకుందామని, పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్యాపిలి ఎస్సై మధుసూదన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం ఎస్సై మధుసూదన్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి ఎలాంటి ఘర్షణలు గానీ, గొడవలు పడకుండా నాయకుని పూజించిన రోజు నుంచి నిమజ్జనం వరకు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీస్ శాఖ వారు భద్రత కలిగిస్తారు వారికి ప్రజలు సహరించాలి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షలు అమలు చేస్తామని ఎస్ఐ మధుసూదన్ పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్తో తయారుచేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమౌతాయని, పర్యావరణ ప్రాధాన్యత తెలియజేసే పండుగ వినాయక చవితి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

