నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వెంకటస్వామి
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైనయువనేత,పారిశ్రామికవేత్త షేక్ వహీద్ హుస్సేన్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి బుధవారం కర్నూలులో వహీద్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాత్రి ప్రభుత్వం నూతన జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వం ప్రకటించింది. నూతన అధ్యక్షుడిని పూల బోకే అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.శాలువాతో ఘనంగా సత్కరించారు. మైనార్టీ నేతకు పదవి అప్పజెప్పడం సంతోషంగా ఉందని జిల్లాలో టిడిపి బలోపేతం చేస్తారని నమ్మకం ఉందని కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు.

