బదిలీ అయిన ఎస్సై శివాంజల్ కు శ్రీ మఠం సన్మానం
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై శివాంజల్ బుధవారం కర్నూలుకు బదిలీ అయ్యారు. మంత్రాలయంలో సేవలందించిన ఎస్సై శివాంజల్ ను శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆదేశాల మేరకు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు , సహాయ మేనేజర్ సురేష్ కోనాపూర్, ధార్మిక అధికారి శ్రీపతచార్ లు మఠం పరిపాలన కార్యాలయంలో శాలువా కప్పి పూలమాలలు వేసి రాఘవేంద్ర స్వామి మెమెంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన ఎస్సైశివాంజల్ సేవాలను కొనియాడారు. మీ సేవలు మరువలేనివి అని అన్నారు.

