విజిలెన్స్ ,తూనికల కొలతల అధికారులు సంయుక్తంగా తనిఖీలు
1 min read
ఆహార భద్రత చట్టప్రకారం కేసు నమోదు
ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ఐస్ క్రీం తయారీ షాపులో నమోనాలు సేకరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఏలూరు వారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా, పెదపాడు మండలం, వట్లూరు గ్రామం,ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో విజిలెన్సు, ఆహార తనికీ అధికారులు మరియు తూనికలు కొలతల అధికారులు సంయుక్తంగా ఐస్ క్రీం తయారీ కేంద్రం అయిన మేస్సేర్స్ సాయి త్రివేణి డైరీ ఫుడ్స్ నందు తనిఖీ చేయగా షాపు నందు గడువు తీరిన 3 రకాల ఐస్ క్రీములను గుర్తించి, ఒక ఐస్ క్రీం నమూనా సేకరించి విశ్లేషణ కొరకు ల్యాబ్ నకు పంపడమైనది మరియు ఆహారభద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగినది. ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేయడం మరియు ఎటువంటి దృవీకరణ లేనటువంటి రెండు కాటాలను గుర్తించి తూనికలు కొలతలు చట్ట ప్రకారం మొత్తం 3 కేసులు నమోదు చేయడం జరిగినది. ఈ తనిఖీల నందు విజిలెన్సు ఎస్ ఐ కె.నాగరాజు,తూనికలు కొలతల అధికారి, ఏలూరు జీ.వి. ప్రసాద్ మరియు ఆహార తనికీ అధికారి కె. రామరాజు పాల్గొనడం జరిగినది.


