కార్తీక మాసం సందర్భంగా పోటెత్తిన భక్తులు
1 min read
వివిధ సేవల రూపేణ రూ:6,01,570/-లు ఆదాయం సమకూరినది
స్వామివారి దర్శన నిమిత్తం సుమారు 25,000 వేల మంది పూజలు
కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కార్తీక మాసం రెండవ మంగళవారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలు శ్రీ స్వామి వారి దేవస్థానం నందు గల ఉసిరి చెట్టు వద్ద కార్తిక దీపాలను వెలిగించినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం సుమారు 25,000 ల మంది విచ్చేసి యున్నారు. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ విచ్చేసిన సుమారు 12,000 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. మంగళవారం మద్యాహ్నం/సాయంత్రం గం.3-00 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.6,01,570/ -లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దేవస్థానం నందు లక్కవరం గ్రామస్తులు ఆర్య వైశ్యులు ఆద్వర్యములో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించబడినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి సుభాష్ వారి ఆద్వర్యములో లక్కవరం ఎస్సై ఎస్.కె .జాబిర్, జంగారెడ్డిగూడెం ఎస్ ఐ వరప్రసాద్, తడికలపూడి ఎస్ఐ సి.హెచ్ చిన్నారావు మరియు జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ ఐ ఎం.కుటుంబరావు భారీ బందోభస్తూ ఏర్పాటు చేసినారు. ఇంకా జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది, బొర్రంపాలెం పిహెచ్ సి వారిచే మెడికల క్యాంప్ వారిచే తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన తెల్పినారు.


