NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి…

1 min read

15,32 వార్డుల్లో ఎన్నికల ప్రచారం

తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం

మాండ్ర..ఎమ్మెల్యే తాపత్రయం

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం పట్టణంలో ఊపందుకుంది. ‘చెప్పాం చేస్తున్నాం- ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో భాగంగా మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యసోమవారం వివిధ వార్డుల్లో వేరువేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎస్ఐ పాలెం 32 వ వార్డులో శివానందరెడ్డి ఇంటింటికి వెళ్లి మున్సిపాలిటీ తెదేపా చైర్మన్ అభ్యర్థి మొల్లా సాబేరున్నిసా మరియు వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి స్వాములు గెలుపు కోసం రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని శివానందరెడ్డి ఓటర్లను కోరారు.అభివృద్ధి చేస్తున్నాం రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింతగా ఇంకా అభివృద్ధి చేస్తామని అభివృద్ధిని చూసి ఓటెయ్యండి అంటూ శివానందరెడ్డి ప్రజలతో అన్నారు.

15 వ వార్డులో ఎమ్మెల్యే ప్రచారం

 15వ వార్డులో ఎమ్మెల్యే గిత్త జయసూర్య చైర్మన్ అభ్యర్థి భర్త లాయర్ జాకీర్ హుస్సేన్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత రెండున్నర సంవత్సరాల పాలనలో పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అభివృద్ధి సంక్షేమానికే మీరు ఓటు వేయాలని కోరుతూ చైర్మన్ అభ్యర్థి మరియు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దేశెట్టి సుమలతను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా టిడిపి నాయకులు డాక్టర్ వనజ, ప్రాతకోట రమణ,డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *