NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిపిపి విధానాన్ని రద్దు చేసేందుకే కోటిసంతకాల సేకరణ చేస్తున్నాం…

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం చిప్పగిరి గ్రామం మరియు కుందనకుర్తి గ్రామం లో  మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మాట్లాడుతు… వైస్సార్సీపీ పార్టీ అధికారం ఉన్నపుడు ప్రజల కు ఇంటి వద్దకే సేవలు అందించడనికి వాలంటీర్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది అన్నారు  ఈ కూటమి ప్రభుత్వం విద్య వైద్యాన్ని  వ్యాపారం చేస్తున్నారు .. ప్రభుత్వ  మెడికల్ కాలేజీలను ప్రైవేటికరణ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు ..  పిపిపి విధానాన్ని రద్దు చేసేందుకే కోటిసంతకాల సేకరణ చేస్తున్నాము అని అంన్నారు.అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  సమక్షంలో గ్రామ అనుబంధ విభాగాల కమిటీని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల జడ్పీటీసీ,సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,జిల్లా ఉపాధ్యక్షులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author