NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హలో మాదిగ – చలో హైదరాబాద్

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో నవంబర్ ఒకటో తేదీన జరగబోయే దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని  జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గావాయిపై దాడి చేసిన న్యాయవాదిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని దాడికి నిరసిస్తూ చలో హైదరాబాద్ను శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కెంచప్ప, ఎంఎస్పి మండల అధ్యక్షులు దేవప్ప, ఆలూరు నియోజకవర్గం కో ఇన్చార్జి మల్లికార్జున, ఎంఎస్పి జిల్లా నాయకులు పక్కిరప్ప, మండల కమిటీ సభ్యులు వెంకటేష్, బసప్ప, శేషగిరి, ఈరన్న, దేవేంద్ర, నగేష్ మంగన్న, మల్లి, కల్లప్ప మూర్తుంజయ, మల్లేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు.

About Author