జగన్ చేసిన అప్పులన్నీ మనమే కట్టాలి !
1 min read

పల్లెవెలుగువెబ్ : జగన్ జె బ్రాండ్స్, డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌రెడ్డి చేస్తున్న అప్పులన్నీ మనమే కట్టాలని అన్నారు. అన్నింటి మీద పన్నులు వేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. గ్రామానికో రౌడీని, సైకోను తయారు చేశారని, సైకోలను పూర్తిగా అణచివేస్తామన్నారు. పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలని.. తనతో కాదన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మనమేమి బాబాయిని చంపలేదు.. కోడి కత్తి డ్రామాలు ఆడలేదని చంద్రబాబు అన్నారు.

