గ్రామీణ రైతులకు అందుబాటులో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్..
1 min read
ప్రారంభిస్తున్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.
చాగలమర్రి రూరల్ ( న్యూస్ నేడు ): మండల పరిధిలోని మద్దూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఆన్సర్ భాష పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఆదివారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ భూమా యువసేన యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రక్కన వాహన చేతకులకు, రైతులకు అనుగుణంగా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. వాహనదారులు పెట్రోల్ కోసం చాలా దూరం నడిచిపోకుండా ఉండేందుకు మంచిది అన్నారు. ప్రారంభోత్సవంలో తెలుగుదేశం నాయకులు జెట్టి నాగరాజు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు.

