NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 “డ్రగ్ డిటెక్షన్ కిట్స్” తో విస్తృత తనిఖీలు

1 min read

అనుమానిత యువకులపై ,  గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ….  ప్రత్యేక డ్రగ్స్ పరీక్షలు

నిర్వహించిన కర్నూలు టూ టౌన్ పోలీసులు

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు  ఆదివారం సాయంత్రం కర్నూలు  ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీ ఉపేంద్రబాబు  ఆధ్వర్యంలో, కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ , ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిసి కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడం కాంపౌండ్, సంకల్ బాగ్ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా అనుమానిత యువకులను గుర్తించి  జిల్లా పోలీస్ శాఖ కు  అందజేసిన “డ్రగ్ డిటెక్షన్ కిట్స్” సహాయంతో  గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు  డ్రగ్స్  పరీక్షలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించి, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కర్నూలు పోలీసులు హెచ్చరించారు.అలాగే ప్రజలు గంజాయి సంబంధిత కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు గాని , డయల్ 112 గాని లేదా  డయల్ 100 కు గాని  లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని  కర్నూలు పోలీసులు సూచించారు.

About Author