12న పాఠశాలల్లో..నూలి పురుగుల దినోత్సవం
1 min read

మిడుతూరు , న్యూస్ నేడు: (నందికొట్కూరు): ఆగస్టు 12వ తేదీన నూలి పురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి రాజు అన్నారు.మంగళవారం ఆశా డే సందర్భంగా ఆశా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో డాక్టర్ మాట్లాడారు.12వ తేదీన ప్రతి గ్రామంలోని ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఆల్బెండజోల్ మాత్రలను అందజేయాలని ఆశా కార్యకర్తలకు డాక్టర్ సూచించారు.వీటికి సంబంధించిన పోస్టర్లను డాక్టర్ రాజుతో పాటు డాక్టర్ వ్యోమ కేష్ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ కే. సురేష్ బాబు, సూపెర్ వైజర్ సి.ఏసేపు,రామతులశమ్మ,ఎం ఎల్ హెచ్,పి,ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

