NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎకరాకు 800 చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకోండి

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతులు వరి పంటకు సంబంధించి ఎకరాకు 800 రూపాయలు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి బొల్లవరం, తమ్మడపల్లె లో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను పంటల ఇన్సూరెన్స్ చేయించుకుంటే రైతులు నష్టపోయిన ఆర్థిక సహాయ సహకారాలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ నుండి అందే అవకాశం ఉందని సూచించారు. అన్నదాత సుఖీభవ కు అర్హులైన జాబితా సంబంధిత గ్రామపంచాయతీ వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడని వారు మరల దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని దానిని సమీపంలోని పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారి వద్ద గ్రీవెన్షల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే తిరిగి పొందే అవకాశం ఉందన్నారు. 10 సెంట్లు కంటే వ్యవసాయ భూమి తక్కువ ఉన్న అన్నదాత సుఖీభవ పథకం వర్తించదని, పన్ను చెల్లించేవారు, ఉద్యోగస్తులకు ఈ పథకం వర్తించదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఓసి ఇతర కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందని అర్హులైన వారందరూ కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూరియా, డి ఏ పి కొరత లేదని దీని రైతులు గమనించి ముందస్తు నిలువలు చేసుకోవద్దని సూచించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి డబ్బులు పడని రైతులు ఒకసారి తమ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయించుకొని ఆధార్ కార్డు మరియు సెల్ నెంబర్ లింక్ అయినవి లేనివి తెలుసుకొని సవరించుకోవాలన్నారు. రైతులు తాము వేసిన పంటలను రైతు సేవ కేంద్రాల వద్దకు వెళ్లి పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మొక్కజొన్న పంటలను పరిశీలించారు. తర్వాత రైతులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు . రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి జీవన సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల నష్టాలనుండి లాభాల వైపు రైతులు పయనించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వర్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ ఏ ఈ ఓ శ్రీనివాసరెడ్డి బొలవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరత్న వీఆర్వో మాధవరావు, బొల్లవరం వ్యవసాయ శాఖ అధికారిని మంజుల ఇతర రైతులు పాల్గొన్నారు.

About Author