NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాక్టర్ కు తాడుకట్టి వైసీపీ వినూత్న నిరసన

1 min read

పెట్రోల్,డీజిల్ పెంపుకు నిరసనగా ధర్నా..

నందికొట్కూరు న్యూస్ నేడు: పెట్రోల్,డీజిల్ పెంపునకు నిరసనగా నందికొట్కూరు పట్టణంలో ట్రాక్టర్ కు తాడు కట్టి ట్రాక్టర్ ను తాడుతో లాగుతూ వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం వైసీపీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ తహసిల్దార్ కార్యాలయం వరకు నాయకులతో కలిసి డాక్టర్ సుధీర్ ధర్నా చేపట్టారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట  ధర్నా అనంతరం తహసిల్దార్ శ్రీనివాసులుకు డాక్టర్ సుధీర్ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ పెంచడంతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని టీడీపీ మ్యానిఫెస్టోలో ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు పూర్తిగా విస్మరించడం ఏంటని ప్రశ్నించారు.పెరిగిన పెట్రోల్,డీజల్ పై 35 శాతం వ్యాట్ ను తగ్గించి ప్రజలపై భారాన్ని చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్ పెరిగితే మాకు ఏమి సంబంధం లేదు అనడం విడ్డూరంగా ఉందన్నారు.నంద్యాల ఎంపీ శబరి పెట్రోల్,డీజల్ తగించేలా లోకసభలో ప్రస్థావన చేసి సామాన్య ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని కోరారు.చంద్రబాబు,లోకేష్ ఇచ్చిన హామీ మేరకు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ముందుగా ఇండియన్ ఆయిల్ బంకు దగ్గర వాహనదారులతో డాక్టర్ సుధీర్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్,కోకిల రమణారెడ్డి,యాట ఓబులేష్,నాగార్జున రెడ్డి, మాధురి గౌడ్,సురేష్ యాదవ్,చరణ్ తేజ్ తదితరులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *