సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవీయ విలువలతో మేళవించి ఆదర్శవంతమైన వైద్యులుగా ఎదగాలి
1 min read
నేటి వైద్య విద్యార్థులే రేపటి సమాజానికి ఆరోగ్య భరోసా – డా. పి. చంద్రశేఖర్, వైస్ ఛాన్సలర్, డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
కర్నూలు, న్యూస్ నేడు : నేటి వైద్య విద్యార్థులే రేపటి సమాజానికి ఆరోగ్య భరోసా అని, వైద్య విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవీయ విలువలతో మేళవించి ఆదర్శవంతమైన వైద్యులుగా ఎదగాలని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్ సూచించారు.శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో 2026 బ్యాచ్ వైద్య విద్యార్థులకు, 2024 బ్యాచ్ విద్యార్థులు నిర్వహించిన “ఉత్కర్ష్–2026” ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్యార్థులు అకడమిక్ పరిజ్ఞానంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం, రోగుల పట్ల కరుణ, మానవీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతర అధ్యయనం, కృషి, పరిశోధనల ద్వారా ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదని, అది సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత అని తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కర్నూలు మెడికల్ కాలేజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
ఈ కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ డా. కె. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీకి దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉందని తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా 823 మెడికల్ కాలేజీలకు నిర్వహించిన IIRF ర్యాంకింగ్‌లో కర్నూలు మెడికల్ కాలేజీ 54వ స్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ స్థానాన్ని సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.విద్యార్థులు కళాశాలకు ఉన్న ప్రతిష్టను నిలబెట్టుకుంటూ, విద్యా విషయాల్లో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు సిలబస్‌ను పూర్తి చేసుకోవాలని, క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.కట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. సి.ఎస్.కె. ప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ డా. శ్రీరాములు, డా. హరిచరణ్, డా. సింధియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. లక్ష్మి, హాస్టల్ వార్డెన్ ప్రొఫెసర్ డా. మాధవి శ్యామల, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ మరియు జూనియర్ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


