NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గౌతమ్ హైస్కూల్లో మున్సిపల్ చైర్మన్ తో పాటు 16 మంది కౌన్సిలర్లకు ఘన సన్మానం

1 min read

హైస్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ

ఆరుమంది శిష్యులు ప్రజా ప్రతినిధులుగా ఎంపిక కావడం పై హర్షం

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది  : మదనపల్లె పట్టణం సిల్క్ టౌన్ గా గుర్తింపు పొందిన నీరుగుట్టువారిపల్లి రాజానగర్ లో గల గౌతం స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సి పల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు) తో పాటు 16 మంది కౌన్సిలర్లు ను హైస్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మి నారాయణ ఆహ్వా నించి ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చే సిన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్(చినబాబు), మరియు కౌన్సిలర్ల ను ఘనంగా టపా కాయలుకాల్చుతూ, బళ్లారి డ్రమ్స్ తో పూల వర్షం కురి పిస్తూ ఆహ్వానిం చారు. తమ పాఠశాలలో విద్య ను అభ్యసించిన తన శిష్యులు ఆరు మంది మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ప్రకటిం చారు. మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సన్మాన కార్యక్ర మానికి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చిన బాబు), 2వ వార్డు కౌన్సిలర్ టి కళావతి, 3వ వార్డు కౌన్సిలర్ రాగినేని కవిత, 4వ వార్డు కౌన్సిలర్ బండి పవన్ కుమార్, 10 వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ సహదేవ నాయుడు, 12 వ వార్డు కౌన్సిలర్ ఎల్లంపల్లి ప్రశాంత్, 21వ వార్డు కౌన్సి లర్ బర్నేపల్లి రవి కుమార్, 23వ వార్డు కౌన్సిలర్ రానా చౌదరి, 37వ వార్డు కౌన్సిలర్ శేషా చలపతి నాయుడు, 41వ వార్డు కౌన్సి లర్ నాగార్జున బాబు,42 వ వార్డు కౌన్సిలర్ మందపల్లి గాయత్రి, 43వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి రత్న మయ్య, 44వ వార్డు కౌన్సిలర్ బండిభారతి, 45 వ వార్డు కౌన్సిలర్ బి. సుశీల, 46వ వార్డు కౌన్సిలర్ బొగ్గుల పార్వతి, 47వ వార్డు కౌన్సిలర్ రామి శెట్టి కేశవ, 48వ వార్డు కొరముట్ల నాగ రాజు లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా హైస్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన శిష్యులు ప్రజా ప్రతి నిధులుగా ప్రజల చేత ఎన్నుకోబ డడం తన ఆనందా నికి అంతే లేద న్నారు. అదే విధంగా 16 మంది కౌన్సిలర్లకు వేరు వేరుగా పుష్ప గుచ్చం, దుశ్యా లువ, పూలమాల, జ్ఞాపికలతో సన్మానించారు.  అనంతరం పలువురు కౌన్సిలర్లు స్పందిస్తూ పుర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయ కుండా వార్డుల సమగ్ర అభివృద్ధికి, సమస్యల పరిష్కా రానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తమను గుర్తించి గౌరవించిన గౌతమ్ హైస్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీ నారాయణకు, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్య క్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, హై స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *