19వ తేదీ నుండి 22వరకు ధార్మిక కార్యక్రమాలు
1 min read
ఆదోని ,న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణం, వసంత టాకీస్ సమీపంలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంనందు ఈ నెల 19వ తేదీ మంగళవారం నుండి 22వ తేదీ శుక్రవారం వరకు ధార్మిక కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 6-00 గంటలకు ఏర్పాటు చేసినట్లు ఇందులో భాగంగా ప్రతిరోజు ఇస్కాన్ ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్ చే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలుఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు మహేంద్రకర్ లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు జె. ఈశ్వరరావు, కార్యదర్శి జవేల్కర్ బాబురావు, సంయుక్త కార్యదర్శి జె. వెంకటేశ్వరరావు, కోశాధికారి పతంగి నరసింగరావు, వడే రఘు, సూత్రవే ఆనంద్, సరోదే వెంకోబరావు, ఆదోని తితిదే కళ్యాణ మండపం సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

