ఏపీలో 4,348 కరోన కేసులు
1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో కరోన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా.. 4,348 కరోన కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోన కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు, శ్రీకాకులం జిల్లాలో మరొకరు మరణించారు. కరోన బారి నుంచి 261 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,204 కరోన కేసులు యాక్టివ్ గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

