NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్యాగమంటే తన్నుతాను సమర్పించుకోవడం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

భక్తిశ్రద్దలతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు: శిబి చక్రవర్తి ఒక పావురాన్ని కాపాడటానికి తన శరీర మాంసాన్నే తూకంలో పెట్టినట్లే, నిజమైన త్యాగి తనకంటే ధర్మాన్ని, ప్రజాహితాన్ని, భూతదయను, ప్రేమను గొప్పగా భావిస్తాడని పరుల రక్షణ కోసం తన స్వార్థాన్ని, తన సుఖాన్ని, అవసరమైతే తన శరీరాన్నికూడా అర్పించగల మహోన్నతమైన భావమే నిజమైన త్యాగమని, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, బలిచక్రవర్తి మొదలైనవారు నిజమైన త్యాగధనులని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సి.బెళగల్ మండలం, పోలకల్ గ్రామంలోని శ్రీకృష్ణ మందిరం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరయ్యస్వామి సర్వజ్యోతి పీఠం పీఠాధిపతి వి. రాజారత్నం, శ్రీకృష్ణ మందిరం అర్చకులు ఆవుల తిక్కన్న, జి. సోమప్ప, వై. వేంకటేశ్వర్లు, వై. శోభన్ బాబు, వై. శేఖర్, ఎ. దస్తగిరి, వై. గోపాల్, తపాల వెంకటేశ్, జె. సుంకన్న, డి. పరశురాముడు, డి. మల్లేశ్, బి. శ్రీనివాసులు, భజన మాష్టరు అల్లీసాబ్, ఎ. చిన్నబసన్న, ఎ. పెద్దబసన్నతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తాదులందరికీ తీర్థప్రసాదాలు అందించారు.

About Author