డిజిటల్ మహానాడు – మినీ మహానాడు ఘన విజయం
1 min read
సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల పరిధిలోని క్లస్టర్-2 ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు (మినీ మహానాడు) కార్యక్రమం భారీ జనసందోహం మధ్య అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందని క్లస్టర్-2 ఇంచార్జ్ వీరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్థికంగా, మానసికంగా, కార్యాచరణ పరంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ, మినీ మహానాడు నిర్వహణకు తమ వంతు సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా టిడిపి సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్, ఎల్.ఎల్.సి డి.సి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్, సి.హెచ్. శేషగిరి, మండల ప్రధాన కార్యదర్శి గోవిందు గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుబాన్, టిడిపి సీనియర్ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున, మండల కార్యదర్శి రైస్ మిల్ మురళి, బి.జె. పంపాపతి, బాగోడి రాము, 42వ బూత్ ఇంచార్జ్ మల్లి, తెలుగు యువత అధ్యక్షుడు బకాడి వీరేష్, కో-కన్వీనర్ జాకీర్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన కో-క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, కో-యూనిట్ ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమం ఘనవిజయానికి తోడ్పడ్డారని కొనియాడారు.అదేవిధంగా కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరికీ వీరేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ సిద్ధాంతాల విస్తరణ కోసం ఇదే ఐక్యత, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. డిజిటల్ మహానాడు విజయవంతం కావడం క్లస్టర్-2 పరిధిలోని పార్టీ శ్రేణుల ఐక్యతకు, క్రమశిక్షణకు, అంకితభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

