బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి వెన్నెముక
1 min read
ఆలూరులో టీడీపీ విజయానికి సమన్వయంతో పనిచేయాలి – వైకుంఠం జ్యోతి
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో BLO–BLA సమావేశంలో పాల్గొన్న ఆలూరు ఇంచార్జ్
ఆలూరు న్యూస్ నేడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO), బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) సమావేశంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, బూత్ కమిటీల పనితీరును మెరుగుపరచడం, ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల చేరికలు, ఓటర్ల వివరాల సవరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు, సలహాలు అందించారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, వారి కృషి ద్వారానే పార్టీ విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఓటరుతో అనుబంధాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.బూత్ స్థాయి వ్యవస్థను మరింత పటిష్టం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలుస్తుందని ఆమె తెలిపారు.


