ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి!
1 min read
ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్.క్రిష్ణయ్య డిమాండ్
న్యూస్ నేడు, పత్తికొండ: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక చదువుల రామయ్య భవన్ లో పత్తికొండ నుండి గుత్తికి వెళ్లే ఆటో కార్మికుల సంఘం సమావేశం ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి హెచ్ రంగన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎన్.క్రిష్ణయ్య మాట్లాడుతూ, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఆటో కార్మికులపై అధికారులు నిబంధనల పేరుతో అనవసరపు జరిమానాలు విధిస్తూ వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఆటో విడిభాగాల ధరలతో ఇప్పటికే ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఆటో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు.ఆటో కార్మికులపై జరుగుతున్న అక్రమ చలానాలు, పోలీసు వేధింపులను మానుకోవాలని కోరారు.పత్తికొండ, గుత్తి ప్రాంతాలలో ఆటో కార్మికుల కోసం ప్రత్యేక ఆటో స్టాండ్‌లను ఏర్పాటు చేయాలనీ, అర్హులైన ఆటో కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు.ప్రమాద వశాత్తూ ఏదైనా జరిగితే ఆటో కార్మికుల కుటుంబాలకు పూర్తి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు రోల్లపాడు వెంకటేష్ పత్తికొండ – గుత్తి రూట్ ఆటో యూనియన్ కార్మికులు చంద్రశేఖర్ తదితరులు, పాల్తోన్నారు.

