NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్తదానంతో పుట్టినరోజుకు గుర్తింపు ఇవ్వండి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మీ పుట్టినరోజుకు పెళ్లిరోజుకు మీ పిల్లలకు పుట్టిన రోజులలో మంచి పనులతో గుర్తింపు రావాలి అంటే రక్తదానం చేయాలని ఇది మంచి కార్యక్రమము అని జన విజ్ఞాన మొక్క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బర్మా సురేష్ కుమార్ పిలుపు నిచ్చారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా తనతో పాటు తన కుమారుడు బి.జయంత్ తన మిత్రుడు రాజ్ కుమార్ పుట్టిన రోజు కూడా ఒకటే కావడం తో అతన్ని కూడా ప్రోత్సహించి రెడ్ క్రాస్ యందు రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ మీ పుట్టినరోజు పెళ్లి రోజులు మంచి గుర్తింపుగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిగట్ల అవుతుందని కచ్చితంగా మీ పిల్లలు కూడా దీన్ని గుర్తుంచుకుంటారని కాబట్టి ప్రతి పౌరుడు రావాలని ఈ విధంగానైనా ముఖ్య రోజుల్లో గుర్తు ముందుకు వస్తే ఎంతోమంది ప్రణాళిక కాపాడిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి సురేష్ కుమార్ రక్తదానం చేస్తూ వేదిక ఎంతోకాలంగా ఇలాంటి  పిలుపునిస్తుందని మంచి స్పందన కూడా ఉందని తెలిపారు.. ఈ రక్తదానంలో సీనియర్ రిపోర్టర్ రాజ్ కుమార్ డిగ్రీ విద్యార్థి బి. జయంత్ రక్తదానం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *