NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్ట్ రుషిరావు ఇంటిపై దాడి చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి

1 min read

జిల్లాఎస్పీ కి వినతి పత్రాన్ని అందించిన ది ఏలూరు ప్రెస్ ఫోరమ్

చట్టపరంగా మీడియా రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు:జిల్లా ఎస్పీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలోని సీనియర్ జర్నలిస్ట్ రుషి రావు ఇంటిపై దాడి చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ కి శనివారం ది ఏలూరు ప్రెస్ ఫోరమ్ అధ్యక్షులు డి.వి రమణ, పిఆర్ఓ సంజయ్,గౌరవ అధ్యక్షులు రత్నగర్భ ప్రసాద్,కోశాధికారి హరీష్, ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జబీర్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ పి.నారాయణరావు, పగడం కళ్యాణ్, మరియు సిహెచ్.వెంకటరావు, సత్యనారాయణ, ప్రతాప్,వి.జయరాం,చింతపల్లి శ్రీనివాస్,తదితర సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసు కట్టడం జరిగిందని. వెంటనే విచారణ ప్రారంభించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన మీడియాకు తెలియజేశారు. ఏలూరు మీడియా ప్రతినిధులు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఇది మంచి పరిణామం అని ఆయన అభినందించారు. ఇటువంటి చర్యలు పునారావత్వం కాకుండా చట్టపరంగా మీడియా రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అందిస్తామని అన్నారు.

About Author