NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖా గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం నేటితో ముగింపు

1 min read

గ్రంథాలయాధికారి  దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో కార్యక్రమం

 ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకర బహుమతులు అతిధులచే అందజేత

ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: పౌర గ్రంథాలయ శాఖా డైరెక్టర్ వారి ఉత్తర్వులు, ఏలూరు జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్,సెక్రటరీ వారి ఆదేశాల ప్రకారం పెదపాడు శాఖా గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 28,2026 నుండి జూన్ 6,20 26 వరకు సుమారు 40 రోజులు నిర్వహించడం జరిగినది.సోమవారం ముగింపు కార్యక్రమం మరియు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా పుస్తకపట్టణం చేయించడం ,కథలు చెప్పడం ,కథలు చదివించడం జరిగినది. ఈ కార్యక్రమానికి వేల్పుల ప్రభాకర్ ఎం.పీ.పీ స్కూల్ హెచ్.ఎం అధ్యక్షత వహించినారు. ముఖ్య అతిథులుగా పెదపాడు పంచాయతీ  ఈ.వోవి.భవాని శ్రీకృష్ణా గురుకులం పాఠశాల హెచ్.ఎం రామాల బెంజిమెన్ పాల్గొనినారు. పాల్గొనిన అతిధులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటి దగ్గరకు పిల్లలను తీసుకువెళ్లడం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు తెలియజేసినారు. సెలవు వస్తే పార్కులకు, సినిమాలకు ,టీవీ, ఫోన్ లకు పిల్లలు అంకితం కాకుండా గ్రంథాలయానికి వెళ్లేలా అలవాటు చేసుకోవాలన్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో చిన్నారులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం.డ్రాయింగ్,వాలీబాల్, స్కిప్పింగ్ ,షటిల్ బ్యాట్మెంట్,క్యారమ్స్, చెస్,లూడో,జనరల్ నాలెడ్జ్ పై క్విజ్, పుస్తక పఠనం,కథలు చెప్పడం,కథలు చదివించడం,డిబేట్, వ్యాసరచనలు మొదలగు శిక్షణ తరగతులలో నేర్చుకోవడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. గ్రంథాలయం అంటే జ్ఞానమని,పుస్తకం చదివితే విజ్ఞానం వస్తుందని తెలిపారు. వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని అనేక అంశాలను తెలుసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు,పాల్గొనిన ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకర బహుమతులు అతిధులచే అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది, పాఠకులు,50 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని నారు. ఈ కార్యక్రమము గ్రంథాలయాధికారి  దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిధులకు,ముఖ్య అతిధులకు విద్యార్థిని,విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. అనంతరము విద్యార్థులు, అతిధులతో జాతీయగీతం పాడించి వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు చేశారు.పాల్గొనిన ప్రతి ఒక్కరికి స్వీట్స్ , డ్రింక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజేసినారు.

About Author