NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ పట్టాలు రద్దు చేయాలని గ్రామప్రజల ధర్నా 

1 min read

న్యూస్ నేడు,పత్తికొండ: పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో ప్రభుత్వ కార్యా లయాలు‌  రైతుభరోసా కేంద్రం మరియు చెత్త తయారీ సంపద కేంద్రం ఎదురుగా పొందిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని సోమవారం గ్రామ ప్రజలు స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ,         మా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్దేశిత భూమిని .సర్వే నంబర్: 816 లో  దళితులు, కొందరు నాందారులైన వాల్మీకులు అంత్యక్రియలు నిర్వహించడానికి ‌‌ కేటాయించబడిందని తెలిపారు. అలాగే స్మశానానికి పడమర వైపు సర్వేనెంబర్‌ 537లో మరికొందరు‌ పిచ్చిగుంట్ల కులానికి చెందిన వారు, బోయ కులానికి చెందిన మోడీ వాళ్లు ‌అంత్య క్రియలు నిర్వహించుకుంటున్నారనీ అన్నారు. మిగిలిన ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల ముందు సర్వేనెంబర్ 910లో పత్తికొండ కర్నూల్ మెయిన్ రోడ్డు రాస్తాను గ్రామ వీఆర్ఏలు ఆక్రమించుకొని అక్రమ పట్టాలు పొందడం జరిగిందని తెలిపారు.మరికొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం, సదరు ప్రభుత్వ భూమికి తప్పుడు మార్గాల్లో , నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు సృష్టించుకుని, ఆ భూమిని పూర్తిగా ఆక్రమించుకున్నారనీ అన్నారు. అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గాజుల భాస్కర్ 1986లో సర్వేనెంబర్ 530లో పూర్తి విస్తీర్ణమును ప్రజల ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి విక్రయించగా, ఈ భూమిలో పేదలకు పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారని, మిగిలిన  భూమిని ప్రజా అవసరాల కోసం కేటాయించడం జరిగిందని అన్నారు.

About Author