NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించండి

1 min read

అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు..

నందికొట్కూరు న్యూస్ నేడు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అల్వాల సత్రంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు వై నరసింహులు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నరసింహులు జెండాను ఆవిష్కరించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు భిన్నంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా వివరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్నారు.పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.పేదలకు పంపిణీ చేయడానికి భూమి లేదు గాని కార్పొరేట్లకు ధారాధత్వం చేయడానికి ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు.అర్హులైన వారికి భూమిని పంపిణీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఓపిడిఆర్ సీనియర్ నాయకులు ఖాజాముద్దీనన్,జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్,ఆనందరావు,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మజీద్ మియా మాట్లాడారు.అనంతరం అఖిలభారత రైతు కూలి  సంఘం నంద్యాల జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షులుగా వై నరసింహులు, ఉపాధ్యక్షులుగా బి ఆనంద్. ప్రధాన కార్యదర్శిగా ఎం గోపాల్,సహాయ కార్యదర్శిగా ఆనందరావు,కోశాధికారిగా లాలు నాయక్,జిల్లా కార్యవర్గ సభ్యులుగా శంకరయ్య,శివ. ఎల్లనాయుడు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

About Author