కూటమి విజయం తోనే మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం
1 min read
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తో పాటు 48 వార్డుల్లోనూ కూటమి కౌన్సిలర్ల ను గెలిపించండి
28వ వార్డు ప్రచారం లో జిల్లా టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మున్సిపాలిటీ రుపు రేఖలు మారాలంటే తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థితో పాటు 48 వార్డుల్లో కూటమి కౌన్సిలర్ల ను ప్రజలు గెలిపించాలని టిడిపి జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు కోరారు. ఆదివారం 28వ వార్డులో భారీ జన సందోహం మధ్య మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు), రాష్ట్ర కార్యదర్శి 28వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల తులసి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ లతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరుగా వార్డులో కలవిడిగా తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన లో మదనపల్లె మున్సి పాలిటీ నందు జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గుర్తించి ఏకపక్షంగా కూటమి పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు ను గెలిపించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మదనపల్లె ను హార్టికల్చర్ హబ్ గా మార్చడానికి లక్ష కోట్లతో శంకుస్థాపన చేయడం జరి గిందని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పాటు కావడంతో, మరింత అభివృద్ధి, సదు పాయాలను మెరుగు పరచాల్సి ఉందని అవన్నీ జరగాలంటే కూటమి విజయంతోనే సాకారం అవుతాయన్నారు. 28వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్ అభ్యర్థి పచ్చి పాల తులసి మరియు విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ లు మాట్లాడుతూ తెలుగు దేశం బిజెపి జనసేన పార్టీలు సంయుక్తంగా మదనపల్లె పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిం చేందుకు శ్రీకారం చుట్టా యని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మదనపల్లె కు ప్రాధాన్యతనిస్తోందని గుర్తుచేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ అభివృద్ధి నినాదం తోనే తాను ప్రజలు ముందుకు వచ్చా నని ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను నిజం చేయటానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని అభ్యర్థించారు. ప్రభుత్వ పెద్దలు మరియు ఎమ్మెల్యే తో కలిసి మదనపల్లె ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.


