శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట పోస్టర్ ఆవిష్కరణ
1 min read
: కర్నూలు జిల్లా కురువ సంఘం.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ భీరలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహోత్సవ ఆహ్వానం పోస్టరును ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రదాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి,స్థలదాత పాల సుంకన్న మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదాన కార్యదర్శి అనితాలక్ష్మి, ఉపాధ్యక్షులు ధనుంజయ, బిల్డర్ వెంకటేశ్వర్లు కోశాధికారి కె. సి.నాగన్న, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు,కె. వీరన్న,రామకృష్ణ, దివాకర్, పుల్లన్న హరిదాసు, తిరుపాల్, వెంకటేశ్వర్లు, చిరంజీవి,తదితరులు ఆవిష్కరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ని కురువ కులస్థులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నవంబరు 27,28,29 తేదీల్లో జరిగే పూజల్లో కులజులు కుటుంబ సమేతంగా పాల్గొని కాశీ శివలింగము, అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభం,నాగులకట్ట దేవుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.29-11-26 ఆదివారం మధ్యాహ్నం కార్తీక వనభోజనం ఉంటుంది.



