NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద మండలంలో కూటమి అభ్యర్థులకు ఘన సన్మానం!

1 min read

11 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు నాయకుల అభినందనలు

శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించిన కూటమి నాయకులు

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లాహొళగుంద మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 స్థానాల్లో విజయం సాధించిన కూటమి అభ్యర్థులను అభినందిస్తూ నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తిప్పయ్య, సీనియర్ నాయకుడు చిన్నహ్యట శేషగిరి, పంపనగౌడ, దర్గన్న మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అభ్యర్థి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హెబ్బటం విష్ణువర్ధన్ రెడ్డి, దుర్గప్ప, మురళీధర్, అబ్దుల్ సుభాన్, సవారప్ప, మల్లికార్జునతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, కూటమి అభిమానులు పాల్గొన్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *