యూట్యూబ్ చానెళ్ల పై కఠిన ఆంక్షలు
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ ప్రభుత్వం యూట్యూబ్ న్యూస్ చానెళ్ల పై కన్నెర్ర చేసింది. కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అడ్డూఅదుపూ లేకుండా యూట్యూబ్ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు కొందరిని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న చానెళ్లను నియంత్రించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మనవడిపై ఓ యూట్యూబ్ చానెల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.