ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో లో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో క్రెడాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్డర్ లతోపాటు రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. నగరంలోని ఎస్టిబీసి కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వివరాలను బిల్డర్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ క్రెడాయి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులు తమ స్టాల్స్ వద్దకు ఆయనను సాధారణంగా ఆహ్వానించి శాలువాలు కప్పి సన్మానించారు. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు సిబ్బంది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన నమూనా భవనాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూల్ నగరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఐకాన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశ్రమల ఏర్పాటుతోపాటు వివిధ రంగాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని వివరించారు. అలాగే కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో క్రెడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో పేరుతో మెగా ఈవెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ లతోపాటు రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాల స్టాల్స్ ,రుణాలు ఇచ్చేందుకు వీలుగా వివిధ బ్యాంకు అధికారులు, సిబ్బంది ఒకే చోట ఉండటం అభినందనీయమని తెలిపారు. కర్నూల్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కర్నూల్ నగరంలో బిల్డర్లు ఆధునిక హంగులతో కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా కర్నూల్ నగరాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అలాగే ప్రజలకు నమూనా భవన నమూనాలను చూపించి వారి అభిరుచులకు అనుగుణంగా భవనాలను అన్ని అనుమతులతో, న్యాయబద్ధంగా ప్రాపర్టీని కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు.

