NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నకు 25 వేలు విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:   కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్డులోని ఏ. పి.ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం, పోలకల్ గ్రామ నివాసి సోమేశ్వర ఫర్టిలైజర్స్ యజమాని కె. పాండురంగడు రూ. 25,000  నగదును గురువారం విరాళంగా   కర్నూలు జిల్లా కురువ సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి, కోశాధికారి కే. సి. నాగన్న మరియు జిల్లా ప్రచార కార్యదర్శి బి. సి. తిరుపాల్, కె. ప్రేమ్ చంద్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి  మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం,  కమ్యూనిటీ హాల్ మరియు విద్యార్థుల హాస్టల్ నిర్మాణమునకు దాతలు ముందుకు వచ్చి విరాళాలను ఇవ్వాలని పిలుపునిచ్చారు.

About Author