NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్వాక్రా సంఘాల కు టాబ్స్ పంపిణీ

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో డోన్ మున్సిపల్ పరిధిలోని మెప్మా డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్స్ కు సామ్సంగ్ గెలాక్సీ ఏ9 ప్లస్ టాబ్స్ లను   డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ డోన్ మున్సిపల్ పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు సేవలు వేగంగా అందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం డిజిటల్ విదానాన్ని తెచ్చింది మున్సిపాల్టీల వారీగా మహిళా సంఘాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు స్లమ్ సమాఖ్య రిసోర్స్ పర్సన్లకు ఈ టాబ్స్ ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ , మెప్మ అధికారులు,ఎస్​హెచ్​జి రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లు పాల్గొన్నారు.

About Author