మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం
1 min read
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిద్దుదాం అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, డిఐజి కోయ ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, నగర మేయర్ బి.వై.రామయ్య తదితరులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1989 నుండి న్ 26 వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు..డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయని, ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని నాశనం చేయకపోతే, మానవాళి మొత్తం నాశనం అయిపోతుందన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయన్నారు.. డ్రగ్స్ వాడకం వల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే లభిస్తుందని, ఒత్తిడి వల్లో లేక ఆనందం లభిస్తుందనో డ్రగ్స్ వాడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్ వాడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.. గతంలో చదువుతో పాటు మనసుకు ఉల్లాసం కలిగేలా ఆటలు, సంగీతం ఇలాంటి ఏదో ఒక వ్యాపకం ఉండేదని, ప్రస్తుతం అలాంటివి లేకుండా చదువు మాత్రమే ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడి కిలోన ఇలాంటి అలవాట్లకు లోనవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ క్రీడల లాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తే దురలవాట్లకు లోను కాకుండా ఉంటారని కలెక్టర్ సూచించారు.
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర , యోగాంధ్ర కార్యక్రమాలతో రాష్ట్రం లో ఉండే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారన్నారు… అదే విధంగా ఈరోజు యువత కి మాదకద్రవ్యాల వాడకంపై అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి జిల్లాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారన్నారు…. ప్రతిరోజు న్యూస్ పేపర్ లో వచ్చే కథనాలు చూసినట్లయితే 10 శాతం మత్తు పదార్థాలు వల్ల కలిగే సంఘటనలే ఉంటాయన్నారు.. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి యువత తెలుసుకొని మంచి మార్గంలో నడిచి జీవితంలో స్థిర పడాలని ఎంపీ యువత కి సూచించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకనుగుణంగా డ్రోన్స్, శాటిలైట్ ప్రక్రియల ద్వారా రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వ్యసనాన్ని మొగ్గలోనే త్రుంచి వేయాలని సూచించారు. యువత మరియు కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా ,కళాశాల, పాఠశాలలలో ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటుపడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గ్యోప్యంగా ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. సమాచారం అందించిన వారికి రివార్డులు కూడా అందజేస్తామన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ కలిగి ఉన్నా, సరఫరా చేస్తున్నా, సేవించిన వారి పై NDPS ACT ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలుంటాయన్నారు. 6 నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు. యువత డ్రగ్స్ మత్తులో పడితే దొంగతనాలు చేస్తారన్నారు. పెద్ద పెద్ద నేరాలు కూడా చేస్తారన్నారు. అధికంగా ధనం పిల్లలకు అందుబాటులో ఉంచరాదని తెలియజేశారు. ఈ మధ్య కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కడుపులో ఉంచి రవాణా చేస్తున్నారని తెలిపారు.. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వాడకం , రవాణా విషయం తెలిసిన వెంటనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవలసిందిగా కోరారు.సమావేశాన్ని ఉద్దేశించి కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ , స్ఫూర్తి రిహాబిలిటేషన్ శివ శంకర్ , సైకియాట్రి స్ట్ డాక్టర్ చైతన్య కుమార్, విద్యార్థినులు జయశ్రీ , సాహితీ , నయోమిక లు మాదకద్రవ్యాల వినియోగం వాటి వలన జరిగే నష్టాల గురించి వివరించారు.తొలుత కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , డి ఐ జి కోయ ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్ , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు మేయర్ బి వై రామయ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు,అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్, ఇంచార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఐసిడిఎస్ పిడి నిర్మల, మెప్మా పిడి నాగశివ లీల, డిఎంహెచ్ఓ డా.శాంతి కళ, డిఈఓ శామ్యూల్ పాల్, తదితరులు పాల్గొన్నారు.



