సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ ఆదేశాలమేరకు సి బెళగల్ పంచాయతీ లొ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం లొ పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చేర్మెన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమం లొ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి సి బెళగల్ పంచాయతీలోని బూత్ నంబర్ 149,150,151 బూత్ లలో డోర్ టు డోర్ తిరిగి ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి లబ్ధిదారులతొ మాట్లాడడం జరిగింది అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను ₹4,000 పెంచిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కింది అని ఆయన తెలిపారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం పథకం ద్వార ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పొతే అంతమందికి తల్లికి వందనం వచ్చింది అని గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ అలాగే త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కూడా లబ్ధిదారుల అకౌంట్ లలో జమ చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మరియు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్ లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

