మత్తు పదార్థాల వ్యసన విముక్తి పై అవగాహన కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మద్యపాన మరియు మత్తు పదార్థాల వ్యసన విముక్తి పై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగినది నగరంలోని ధర్మపేటలో నైపుణ్య రహిత మరియు అల్పాదాయ వర్గాల కార్మికులను ఉద్దేశించి డ్రగ్స్ మత్తు కలిగించేటటువంటి పదార్థాల వల్ల వచ్చే అనర్థాల గురించి వివరించి చెడు వ్యసనాల జోలికి పోకుండా కుటుంబ పరిరక్షణ కోసం పాటుపడేలా కృషి చేయాలని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగినది ఇందులో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు మరియు ఎన్జీవో ప్రెసిడెంట్ మరియు కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈఎస్టిఎఫ్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ప్రజలు పాల్గొన్నట్టు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తెలిపాడు.

