మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
1 min read

సూపర్ 6 హామీలన్నీ అమలుచేసి తీరుతాం
హొళగుంద న్యూస్ నేడు : సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఈ రోజు హొళగుంద లో 40భూత్ పలు కాలనీల్లో పార్టీ నాయకులు పర్యటించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ చేసిన ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుగుసుకొని సంబంధిత ఎంవైటిడిపి యాప్ నందు నమోదు ప్రక్రియ చేయడం జరిగింది. చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు అని సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ కోగిలతోట జాకీర్ పేర్కొన్నారు.గ్రామంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల తో మాట్లాడుతూ వారి సమస్యలను కోగిలతోట జాకీర్ ముల్లా మోయిన్ షాలి అమన్ ఆదం అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ పాలన పట్ల,స్థానిక నాయకుల పనితీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్లు సమయానికి ఇస్తున్నారని, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చారని స్థానికులు నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో 40బూత్ ఇంచార్జ్ లు షాలి అమన్ సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ కోగిలతోట జాకీర్ ఆదం షాలి మహాబాషా అల్తాఫ్ సుబాన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

