NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాకు చదువుకోవాలని ఉంది.. అధికారులు సహాయం చేయండి

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  మాకు చదువుకోవాలని ఉంది మా గ్రామం నుండి సరైన వసతులు లేక పొలం పనులు పోతున్నామని సరస్వతి పార్వతి లు అన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ మది. లింగదహళ్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి పూర్తిచేసుకుని కేజీబీవీ పాఠశాలలో ఆన్లైన్ దరఖాస్తు చేసు కున్నారు. కేజీబీవీలో సీటు రాకపోవడంతో దళిత సామాజిక వర్గం ఎస్సీ మాదిగ కులానికి చెంది వలస కూలీలు అయిన వీరి తల్లిదండ్రులు ఆరవ తరగతి కోసం హెబ్బటం లేదా హుళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ప్రతిరోజు తమ గ్రామం నుంచి పంపించ డానికి సరైన వసతి లేక ఎక్కడ పాఠశాలలో చేర్పించక ఇంటి వద్దనే ఉంచుకొని కూలీ పనులకు పంపిస్తున్నారు .తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వలస పోతే తమ పిల్లలను తమ వెంట తీసుకుపోతామని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేము అని పేర్కొంటున్నారు. తమకు చదువుకోవాలని ఉందని అయితే తమ తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పించకపోవడంతో తాము చదువుకోలేక కూలీ పనులకు పోతున్నామని అధికారులు సహాయం చేసి కేజీబీవీలో సీటు ఇప్పిస్తే హాస్టల్లో ఉండి చదువుకుంటామని ఈ విద్యార్థులు చెబుతున్నారు. కావున జిల్లా ఉన్న అధికారులు తమను కేజీబీవి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

About Author