ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కై విద్యార్థుల ర్యాలీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రానున్న కాలంలో ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించుకొని ఆరోగ్యకర ప్రపంచంలో జీవిద్దాం అంటూ విద్యార్థులు శనివారం ర్యాలీ చేపట్టారు.స్థానిక బి క్యాంపు ప్రాంతంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్వర్ణ ఆంధ్ర ,స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా బి క్యాంపు పరిసర ప్రాంతాలలో ప్రధానోపాధ్యాయులు శంకర్ నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం నిషేధం పై ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించి పుడమి తల్లిని రక్షించు, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి పాఠశాల పరిసర ప్రాంతంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్,ఉపాధ్యాయులు ఎన్సిసి ఆఫీసర్ విజయకుమార్,హరి శంకర్,అన్వర్, వెంకటేశ్వర్లు,జమీల్, విజయ్ కుమార్ ,జగన్మోహన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

