NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల కోసం రోడ్డు ఎక్కడానికి సిద్ధం

1 min read

రైతులకు యూరియా సక్రమంగా అందేలా చూస్తాం

వైకాపా శ్రేణులు, నాయకులు అందరూ కలిసి కట్టుగా ముందుకు రావాలి..

బాబు షూరిటీ మోసం గ్యారంటీ

సమావేశం లోటీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు వై. సీతారామిరెడ్డి

మంత్రాలయం, న్యూస్​ నేడు:  రైతుల కోసం రోడ్డు ఎక్కడానికి రాంపురం రెడ్డి సోదరులు ఎప్పటికీ సిద్ధం గా ఉంటామని టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు సీతారామిరెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన బాబు ష్యూరీటి మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి ,  మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి , సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ఆయనకు  ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ నేరవేర్చలేనని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని తెలిపారు. దీనికి  వైస్సార్సీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి , ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  నేతృత్వంలో ప్రతి గడపకు వెళ్లి రీకాల్ చంద్రబాబు అనే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి లబ్ధిదారులకు అందిన పథకాలు, అందలేని పథకాలను వివరించాలన్నారు. అదే విధంగా నియోజకవర్గం లో రైతులకు అవసరమైన ఎరువులు సక్రమంగా పంపిణీ చేయకుండా రాజకీయం చేస్తున్నారని మా దృష్టికి ఇప్పటికే వచ్చిందని అయితే వెంటనే నేను మా సోదరుడు అధికారులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఇంకా ఇబ్బందులు పడుతుంటే మేమే నేరుగా వచ్చి ఎరువులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నిజంగా మీ అందరి ప్రేమ అనురాగాలతో మా తమ్ముడు వై. బాలనాగిరెడ్డి  నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడని ఇదే తరహాలోనే అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి రానున్న రోజుల్లో కూడా అత్యధిక మెజార్టీతో మా తమ్ముడు వై. బాలనాగిరెడ్డి ని, జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని మీ రుణం తీర్చుకో లేనిదని భావోధ్వేగానికి గురై కోరారు. అనంతరం పెద్దాయన కు పలువురు నాయకులు, కార్యకర్తలు శాలువ కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలం లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author