NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి బి చంద్ర నాయక్

1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు :  జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు, పి చంద్ర నాయక్ సోమవారం చెన్నూరు రైతు సేవా కేంద్రం ను ఆకస్మిక తనిఖీ  చేసి యూరియా స్టాక్ ను పరిశీలించడం జరిగింది.అలాగే రైతులకు యూరియాను సరఫరా చేయడం జరిగింది. రైతులతో మాట్లాడుతూ రైతులు అవసరం అయినా దానికంటే యూరియాని ఎక్కువ వేస్తున్నారని దాని వలన భూసారం దెబ్బతింటుందని ఖరీఫ్లో రైతులు ఎకరాకు యూరియా 100 కేజీలు మూడు దఫాలు గా వేసుకుంటే సరిపోతుందని దుక్కి లో పోటాష్ ఎరువు ను తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేశారు  తగినంత యూరియా నిల్వలు జిల్లా లో ఉన్నాయని రైతు సేవా కేంద్రం కి సరఫరా చేస్తామని రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ వ్యవసాయ అధికారి ఎస్ గోవర్ధన్ మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి గ్రామ వ్యవసాయ సహాయకురాలు రెడ్డి నాగేశ్వరి హార్టికల్చర్ ఎంపిఈఓ లక్ష్మీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author