NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యశ్వంత్ పృద్వి కి కారుణ్య నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ

1 min read

జిల్లా ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియామకo

విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడం,ప్రోత్సహించటం మన బాధ్యత

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో  ఉద్యోగ నిర్వహణ చేస్తూ అనారోగ్య కారణాల వలన ఆసువు లు బాసిన  కె.డేవిడ్ రాజు  యొక్క కుమారుడు యశ్వంత్ పృద్వి కి  కారుణ్య  ఉద్యోగ నియామక పత్రాము ను అంద చేసిన జిల్లా ఎస్పీ కొడమంచిలి డేవిడ్ రాజు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొవ్వూరులో పనిచేస్తున్న తరుణంలో  31.10.2024 వ తేది నాడు అనారోగ్య కారణాల వలన చనిపోయినట్లు వారి యొక్క  యశ్వంత్ వృద్ధి అను అతనికి కారుణ్య నియామకం ప్రకారం ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్  ఉద్యోగ నియామక ఉత్తర్వులను జిల్లా ఎస్పీ  స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రోత్సహించడం మరియు ఆదుకోవడం మా ప్రధాన బాధ్యత. అటు వంటి కుటుంబాలకు తోడుగా నిలబడేందుకు ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామక విధానానికి అనుగుణంగా ఈ నియామకం చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు, ఏలూరు జిల్లా  పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఏ వై.ఎస్.వి ప్రసాద్, పోలీస్ ఉన్నతాధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author