NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉరుకుందకు పాదయాత్ర

1 min read

శ్రావణం.. భక్తిమయం..

కర్నూలు ​, న్యూస్​ నేడు:భక్తుల ఆరాధ్యదైవం… కొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ ( ఉరుకుంద ఈరన్న ) స్వామి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు. గురువారం అమావాస్య రోజు కావడంతో శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు శ్రావణమసంలో నెలన్నర రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  ఇప్పటికే దేవాలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

కర్నూలు నుంచి పాదయాత్ర

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పలు ప్రాంతాల్లోని భక్తులు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  ఈ నెల 28న కర్నూలు పట్టణం నుంచి కోడుమూరు రోడ్డులోని అవిఘ్న ఎమరాల్డ్​ వెంచరు నుంచి దాదాపు 500 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరనున్నారు.  భక్తిమయంతో కొనసాగే ఈ పాదయాత్రలో దాతలు భోజనం, అల్పాహారం, వాటర్​ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్​ మెడికల్​ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పాదయాత్రగా బయలుదేరే భక్తులు సెల్​.9701699652, 9642187476, 9492759757 నెంబర్లను సంప్రదించాలని  ఉరుకుంద ఈరన్న స్వామి భక్తుడు వెంకట శెట్టి తెలిపారు.

About Author